అభిషేక్ బచ్చన్ , సోనం కపూర్ తర్వాత దీపికా పడుకొనె కూడా కంగనా రనౌత్ నటించిన ‘పంగ’ మంచి హిట్టవుతుందనే ధీమా వ్యక్తం చేశారు. ‘పంగ’ సినిమా ట్రెయిలర్ చూసి ఇంప్రెస్ అయిన దీపికా ఈ వ్యాఖ్యలు చేశారు. నేను నటించిన వాటితో పాటు నేను ఎన్నో సినిమాల ట్రెయిలర్స్ ఒక ప్రేక్షకురాలిగా చూస్తుంటాను..పంగ సినిమా నన్ను ఎంతగానో ఇంప్రెస్ చేసిందని చెప్పారు. ఈ ట్రెయిలర్ చూస్తుంటే చాలా మంచిగనిపించిందని తెలిపారు.
మాజీ కబడ్డీ ఛాంపియన్ జయ జీవిత చరిత్ర ఆధారంగా పంగ సినిమాను నిర్మించారు. 30 ఏళ్ల వయసులో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన ఆమె ఎదుర్కొన్న సవాళ్లను ప్రపంచానికి తెలియజేయాలనేది ఈ సినిమా ఉద్దేశం. దీనిలో కంగనా రనౌత్ జయ పాత్ర పోషిస్తున్నారు.