ఈ కంప్యూటర్ యుగంలో ఏదైనా సాధ్యమే…ఉన్నది ఉన్నట్టుగా చూపడమే కాదు…లేనిది కూడా ఉన్నట్టుగా…అబద్దాన్ని నిజంగా నమ్మించవచ్చు కూడా. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే..ఇటీవల ఓ యాప్ విడుదలైంది. దాని పేరు ‘డీప్ న్యూడ్’. ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే చాలు మనకు ఇష్టమైన అమ్మాయిలను నగ్నంగా చూడవచ్చు. మనకు ఇష్టమైన అమ్మాయిల ఫోటోలను ఈ యాప్ లో ఓపెన్ చేస్తే ఆ ఫోటోలోని దుస్తులన్నీ మాయమై నగ్న శరీరం దర్శనమిస్తుంది. ఆ అమ్మాయే నగ్నంగా ఫోటో దిగినట్టు కనిపిస్తుంది. ఫోటోలోని దుస్తులను తొలగించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత న్యూరల్ నెట్ వర్క్స్ ను వాడారు. ఫోటోలోని అమ్మాయి శరీరం కలర్, శరీరాకృతి, లైటింగ్, షాడోస్ అన్ని కూడా అచ్చం ఆ అమ్మాయి లాగానే ఉండేలా యాప్ ను రూపొందించారు డెవలపర్స్.
ఈ యాప్ గురించి కొన్ని నెలల క్రితం టెక్ న్యూస్ సైట్ ‘మదర్ బోర్డు’లో మొదటి సారిగా ఆర్టికల్ రాశారు. ప్రస్తుతం దీన్ని ఆఫ్ లైన్ లో ఉంచారు. ఈ యాప్ అందరినీ ఆకర్శించడమే కాకుండా అంతకు మించిన విమర్శలకు కూడా గురయ్యింది. ఓ విమర్శకుడైతే దీన్ని టెర్రిఫైయింగ్ యాప్ గా పేర్కొన్నాడు. మొత్తమ్మీద ఈ యాప్ ను ఆన్ లైన్ లో పెట్టకుండా అడ్డుకోగలిగారు. యాప్ డెవలపర్సే దీన్ని వెబ్ లో నుంచి తొలగించారు. ఈ యాప్ ను వాడడానికి ప్రపంచం సిద్ధంగా లేదన్నారు. అంతేకాదు ప్రజలు దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉందని యాప్ ప్రోగ్రామర్స్ ట్వట్టర్ లో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రకంగా తాము డబ్బులు సంపాదించదల్చుకోలేదని కూడా స్పష్టం చేశారు. అంతేకాదు ఇప్పటికే ఈ యాప్ ను కొనుక్కున్న వాళ్లకు డబ్బలు తిరిగి చెల్లిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి కొత్త వెర్షన్ ను తీసుకొచ్చేది లేదని ఖరాకండిగా చెప్పారు. ఇప్పటికే ఈ యాప్ ను తమ వెబ్ సైట్ నుంచి కాపీ చేసుకున్న వారు షేర్ చేయవద్దని డెవలపర్స్ కోరారు. ఎవరూ దీన్ని ఉపయోగించే వీలు లేకుండా చేశామన్నారు.అయినా ఈ యాప్ ఉన్న వాళ్ల దగ్గర ఇది ఇప్పటికీ పని చేస్తుంది.
ఈ యాప్ కనుక ఆన్ లైన్ లో అందుబాటులోకి వస్తే సమాజంలో అశాంతి ..లైంగిక వేధింపులు పెరుగుతాయని…తమతో డేటింగ్ చేయని అమ్మాయిల నగ్న ఫోటోలు వైరల్ అవుతాయని సమాజం ఆందోళన వ్యక్తం చేసింది. క్రైమ్ రేట్ పెరుగుతుందని పోలీసులు చెప్పారు.
టెక్నాలజీ మంచిదే…దాన్ని సమాజ హితానికి ఉపయోగించినప్పుడే మంచిది. లేదంటే అది అత్యంత ప్రమాదకరమైనది.