యంగ్ హీరో సందీప్ కిషన్ నటించి ఇటీవల విడుదలైన సినిమా మైఖేల్. ఇది పాన్ ఇండియా సినిమాగా విడుదలైంది.ఇందులో ప్రధాన పాత్రలో దీప్షిక నటించారు. అయితే ఈ సినిమాలో ఆమె నటించిన అనేక సన్నివేశాలను తొలగించినట్లు ఆమె తెలిపారు. అంతేకాకుండా ఆమె విచారం కూడా వ్యక్తం చేశారు.అదే సమయంలో ఈ మూవీలో ఆమె నటనకు వస్తున్న ప్రశంసలు చూసి పొంగిపోతున్నారు.
దీనిపై దీప్షిక మాట్లాడుతూ… ‘ఈ మూవీలో నేను నటించిన జెన్నిఫర్ పాత్రలో మరో నటి నటించాల్సి ఉంది. చివరి నిమిషంలో ఆమె తప్పుకోవడంతో ఆ అవకాశం నాకు దక్కింది. దర్శకుడు రంజిత్ జయకొడి చెప్పిన వన్ లైన్ స్టోరీ నన్ను ఎంతగానే ఆకర్షించింది. ఈ మూవీ మొత్తం నా పాత్ర చుట్టూనే తిరుగుతుంది.
అందుకే స్టోరీ వినగానే మరో ఆలోచనకు తావు లేకుండా నటించేందుకు ఒప్పుకున్నా. ఇందులో విజయ్ సేతుపతి (Vijay Sethupathi)కి, నాకు మధ్య అనేక సన్నివేశాలను చిత్రీకరించారు.
కానీ, మూవీ లెంగ్త్‌ను దృష్టిలో ఉంచుకుని వాటిని తొలగించారు. ఇది చాలా బాధ కలిగించింది. అలాగే ఇందులో నా పాత్రకు వస్తున్న ప్రశంసలు ఎంతో ఆనందాన్నిస్తున్నాయి’ అని పేర్కొంది.