సిగ్నల్ పడితే చాలు…దాన్నినుంచి ఎలా తప్పించుకుందాం. ఏ సందులోంచి దూరెద్దాం, ట్రాఫిక్ కానిస్టేబుల్ కన్నగప్పి ఎలా చెక్కెద్దామని చాలా మంది ఆలోచిస్తారు. కానీ అడవిలో పుట్టి అడవిలో పెరిగి..నాగరికత మచ్చుకు కూడా తెలియని ఓ జింక ట్రాఫిక్ రూల్స్ పాటించింది.
రోడ్డు దాటే ముందు ట్రాఫిక్ నిలిచిపోయేవరకూ సహనంతో ఓ జింక వేచిచూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జపాన్‌లోని నారా ప్రాంతంలో రికార్డయిన ఈ వీడియోను హిప్పో ఫైట్ అనే అకౌంట్ రెడిట్‌లో షేర్ చేసింది.
జపాన్‌లో ఓ జింక రోడ్డు క్రాస్ చేసే ముందు ట్రాఫిక్ ఆగే వరకూ వేచిచూస్తోందని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో రెడిట్ యూజర్లను విశేషంగా ఆకట్టుకుంది.
ఇది పూజ్యనీయమైదని ఓ యూజర్ కామెంట్ చేయగా జింక వయసు మీరినదై ఉండాలి లేకుంటే గాయపడి ఉంటుందని అందుకే దాని కదలికలు మెల్లిగా ఉన్నాయని మరో యూజర్ కామెంట్స్ సెక్షన్‌లో రాసుకొచ్చారు.
A Deer in Nara (Japan) politely waiting for traffic to stop before crossing from aww