రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై నేటికి నెల రోజులు పూర్తయింది. ఫిబ్రవరి 24న రష్యా రెడ్ ఆర్మీ ఉక్రెయిన్ లోకి ప్రవేశించింది. కానీ.. నెల రోజులు గడిచినా ఉక్రెయిన్ మాత్రం రష్యా చేపడుతున్న చర్యలకు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు ఐక్యరాజ్యసమితి కౌన్సిల్ లో ఓటమి రష్యా నైతికతను కూడా విచ్ఛిన్నం చేసింది. బుధవారం అర్థరాత్రి జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో రష్యా ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య, ఉక్రెయిన్ మానవతావాద పరిస్థితిపై యూఎన్ భద్రతా మండలిలో రష్యా రూపొందించిన తీర్మానంపై ఓటింగ్ కు భారత్ సహా మరో 12 దేశాలు దూరంగా ఉన్నాయి. ఈ తీర్మానానికి మద్దతుగా రష్యా, చైనా మాత్రమే ఓటు వేశాయి. ఐక్యరాజ్యసమితిలో రష్యా ప్రతిపాదనపై ఓటు వేయకుండా ఉక్రెయిన్ యుద్ధంలో మనం తటస్థంగా ఉన్నామని భారత్ మళ్లీ నిరూపించింది. దీనికి ముందు కూడా పాశ్చాత్య దేశాలు రష్యాకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన అభిశంసన తీర్మానంపై భారత్ అదే వైఖరిని అవలంభించింది. దానిపై అనేక ప్రశ్నలను నాటో దేశాలు వెల్లువెత్తినప్పటికీ.. అంతర్జాతీయ దౌత్య నీతిని ప్రదర్శించింది భారత్.
రష్యా దురాక్రమణదారు.. ఉక్రెయిన్ ప్రజలపై క్రూరత్వ ప్రచారంలో నిమగ్నమై ఉందని యూఎన్ రాయబారి లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్ పేర్కొన్నారు. రష్యా మాత్రమే సృష్టించిన మానవతా సంక్షోభాన్ని పరిష్కరించడానికి అంతర్జాతీయ సమాజాన్ని కోరుతూ తీర్మానాన్ని ముందుకు తెచ్చే ధైర్యం రష్యాకు ఉండటం నిజంగా మనస్సాక్షి కాదు అని అన్నారు. తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడం ద్వారా రష్యాకు మద్దతు ఇచ్చిన ఏకైక దేశం చైనా అని వ్యాఖ్యానించారు.
ఉక్రెయిన్ లో మానవతావాద పరిస్థితిలో యూఎన్ఎస్సీ తన పాత్రను పోషించాలని పేర్కొన్న సమయంలో ఈ తీర్మానం వస్తుందని వివరించారు. అదే విధంగా ఐక్యరాజ్యసమితిలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా శాశ్వత ప్రతినిధి జాంగ్ జున్ బీజింగ్ ఆరు పాయింట్లను ప్రతిపాదించారు. కాగా.. భద్రతా మండలి తీర్మానానికి అనుకూలంగా కనీసం తొమ్మిది ఓట్లు అవసరం. అయితే.. అందుకు సంబంధించిన ఓట్లు రాకపోవడంతో ప్రవేశ పెట్టిన తీర్మానంలో రష్యా ఓడిపోయింది.