ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ ఉదయగిరి యుద్ధ నౌకలు మంగళవారం జల ప్రవేశం చేశాయి. స్వదేశీయంగా తయారు చేసిన ఈ రెండు యుద్ధనౌకలను ముంబైలోని మజ్ గావ్ డాక్ లో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు.
దేశీయంగా నిర్మించిన రెండు యుద్ధనౌకలను ఒకేసారి ప్రారంభించడం దేశ రక్షణ రంగ చరిత్రలో ఇదే తొలిసారి అని మజ్ గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ పేర్కొంది.
ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ…. భారత్ కేవలం తన కోసమే కాదు ప్రపంచానికి అవసరమైన యుద్ద నౌకలను కూడా నిర్మించగలదని ఆయన అన్నారు. మన లక్ష్యం కేవలం ‘ మేక్ ఇన్ ఇండియా’ కాదు ‘మేక్ ఫర్ వరల్డ్’ అని తెలిపారు.
భారత్ నేవీ సామర్థ్యాన్ని ఇప్పుడు ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయని చెప్పారు. ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ సూరత్ యుద్ధ నౌకల ఆవిష్కరణతో భారత్ నౌకా నిర్మాణంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు.