కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చుట్టాలు ఏడాది పాటు అమలు అయ్యాక.. పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రైతులకు విజ్ఞప్తి చేశారు.అప్పుడు కూడా కొత్త చట్టాలతో ఉపయోగం అనిపిస్తే లేదని అనిపిస్తే సవరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టంచేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలో పాల్గొన్న వారు రైతు కుటుంబాలకు చెందినవారని..వారంటే తమకు గౌరవం ఉందని చెప్పారు. అన్నదాతలకు ఉపయోగం లేని నిర్ణయాలను తమ ప్రభుత్వం ఎప్పటికీ తీసుకోదని ఆయన అన్నారు.
ఢిల్లీలో రైతు చట్టాలపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్న రాజ్‌నాథ్ సింగ్.. రైతులు.. కేంద్రంతో చర్చలకు ముందుకురావాలని కోరారు. చర్చలతో సమస్యల పరిష్కరించుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.