చాలా మందికి… ఎలక్ట్రికల్ సామాన్లకు, ఎలక్ట్రానిక్ సామాన్లకు మధ్య తేడా తెలియదు. అసలు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ రెండూ ఒకటేనా అనే విషయంలో కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు సైతం ఉన్నారు. అసలు ఆ రెండింటి మధ్య తేడా ఏంటీ అనేది ఒకసారి చూద్దాం. విద్యుత్తు నిరంతరంగా సరఫరా అవుతుంటే దాన్ని వేరే ఏదైనా శక్తి కిందకి (తిరగడం, వేడి, కాంతి వగైరా) మారుస్తూ పని చేసేది ఎలక్ట్రికల్ పరికరం.
విద్యుత్‌శక్తి ప్రసారం అయినంత సేపు మాత్రమే ఇది పని చేస్తుంది. విద్యుత్‌శక్తిని దాచుకుని అది ప్రసరించని సమయంలో కూడా పని చేసే లక్షణం దీనికి లేదు. ఇక ఎలక్ట్రానిక్ పరికరాలు మనం ఇచ్చిన విద్యుత్‌శక్తిని తీసుకుని ఒక నిర్ధిష్టమైన పని చేయడానికి ఆ శక్తిని విద్యుద్భరితంగా అయినంతసేపూ వాడుకునేవి. మనం ఒకసారి ఛార్జ్ చేస్తే, ఈ పరికరాలు ఆ విద్యుత్‌శక్తిని మార్చుకుని వాడుకుంటాయి. ఎలక్ట్రికల్ పరికరాలు తీసుకుంటే… బల్బు, ఫ్యాను, మోటార్, ఫ్రిడ్జ్, హీటర్, టీవీ వంటివి. కరెంట్ ఉన్నంత సేపు మాత్రమే ఇవి పని చేస్తాయి.
బల్బ్ విద్యుత్ శక్తిని కాంతి రూపంలో… విద్యుత్‌శక్తిని ఫ్యాను భ్రమణ శక్తి రూపంలో, హీటర్ ఉష్ణశక్తి అంటే వేడి కిందకి మారుస్తాయి. ఇక ఎలక్ట్రానిక్ పరికరాల విషయానికి వస్తే ల్యాప్‌టాప్, మొబైల్ లోకి విద్యుత్ శక్తి ప్రసిరించినప్పుడు దాన్ని మానిప్యులేట్ చేసి, ఛార్జింగ్ గా మార్చి, ఆ బయటి విద్యుత్ ప్రసారం లేనప్పుడు కూడా తమ పని అవి చేస్తాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు ఉదాహరణకు ల్యాప్‌టాప్, మొబైల్, ట్యాబ్లెట్. చార్జింగ్ తో పని చేసేవి అన్నీ ఎలక్ట్రానిక్ పరికరాలు.