పాన్ ఇండియా సినిమా అంటే ఏంటి? దానికి ఎలాంటి లక్షణాలు ఉండాలి? అసలు దేశంలో పాన్ ఇండియా కాన్సెప్ట్ ఉందా? ఈ ప్రశ్నలకు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సమాధానం చెబుతున్నాడు. తన దృష్టిలో పాన్ ఇండియా సినిమా అంటే ఏంటో ఉన్నదున్నట్టు నిజాయితీగా చెబుతున్నాడు.
– ఇండియన్ సినిమా అనే కాన్సెప్ట్ ఆల్రెడీ ప్రారంభమైంది. ఇంకా చెప్పాలంటే లేట్ అయిందని నేను భావిస్తున్నాను. పేస్ట్, బ్రష్, సబ్బు, సూపర్ మార్కెట్ కు దేశవ్యాప్తంగా అప్పీల్ ఉన్నప్పుడు సినిమాకు ఎందుకు ఉండకూడదు. ఒకే ప్రాంతానికి ఎందుకు పరిమితం కావాలి. కాబట్టి ఇప్పటికే లేట్ అయింది. ఇండియన్ సినిమా అనే కాన్సెప్ట్ మొదలైంది. ఇక టైమ్ అంతా మనదే.
– బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమా అనే కాన్సెప్ట్ మొదలైంది. అదృష్టం కొద్దీ అందులో నేను భాగమయ్యాను. మేం కాకపోతే మా స్థానంలో మరో సినిమా వచ్చి ఉండేది. అది ప్రాసెస్ లో భాగం ఎవ్వరూ ఆపలేరు. రాబోయే రోజుల్లో మరిన్ని ఇండియన్ ఫిలిమ్స్ రాబోతున్నాయి. మనం అలాంటి సినిమాలు చూడబోతున్నాం.
– ఇండియన్ సినిమా అంటే గ్రాండ్ గానే ఉండాలి, భారీ బడ్జెట్, గ్రాఫిక్స్ ఉండాలి అనుకుంటే పొరపాటు. దేశం మొత్తాన్ని ఏకం చేసే ఓ చిన్న స్టోరీ కూడా కావొచ్చు. ఏ ప్రాంతం నుంచైనా రావొచ్చు. ఇండియా సినిమా అంటే గ్రాండ్ గా ఉండడం కాదు, ఇండియన్ సోల్ ను ప్రజెంట్ చేయడం.
Advertisements
– ప్రస్తుతం అందరూ భాషతో సంబంధం లేకుండా ప్రయోగాల దశలో ఉన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి ఇండియన్ సినిమాలొస్తాయి. ఇండియన్ సినిమా అనే కాన్సెప్ట్ ను అర్థం చేసుకునేందుకు ఇప్పుడిప్పుడే అంతా ప్రయత్నిస్తున్నారు.