నటుడు, నిర్మాత, బండ్ల గణేష్ హీరోగా ప్రస్తుతం డేగల బాబ్జీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వెంకట్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని యష్ రిషి ఫిలిమ్స్ బ్యానర్ పై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ఒత్తు సేరుప్పు సైజ్ 7 సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఈ చిత్రం జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, ట్రైలర్, లుక్స్ అన్నీ కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. అయితే తాజాగా ఈ సినిమాలోని లిరికల్ వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. బండ్ల గణేష్ కూతురు ఈ సాంగ్ ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ ట్రైలర్ పోస్టర్ విడుదల చేసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్, హరీష్ శంకర్ కు ధన్యవాదాలు తెలిపారు. తెలుగు లో స్టార్ హీరోలు ఎవరు చేసినా ఈ సినిమా చాలా బాగుంటుంది అనుకున్నాను. అయితే ఈ సినిమాలో నటించమని నన్నుకోరితే నేను యాక్ట్ చేయడం ఏమిటి నేను యాక్టింగ్ మర్చిపోయాను.
తమిళ్ లో పార్థిబన్ అద్భుతంగా నటించారు. నేను ఆయనలా చేయలేను అంటూ చెప్పానని… అయితే నన్ను కన్విన్స్ చేసి ఒప్పించారని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. మరి ఈ సినిమాతో బండ్ల గణేష్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.