డిగ్రీలు,పీజీలు చదివి హమాలి పని చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు కొంత మంది విద్యార్థులు. వరంగల్ ఎనమములకు చెందిన స్థానిక యువకులు మార్కెట్ లో రోజువారీ కూలి పని చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు.
ఉద్యోగాలు లేక వేరే దారి లేక మేము ఈ పని చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీలు,పీజీలు చేసి పట్టాలు ఉండి కూడా హమాలి పనిచేసుకుంటు జీవనం సాగిస్తున్నామని పేర్కొన్నారు.
ఒక బస్తాకు 5రూ.. చొప్పున రోజుకు 200 నుంచి 300 వందలు రూపాయలు సంపాదించుకుంటున్నామని వారు తెలిపారు. నోటిఫికేషన్స్ వస్తాయి..వస్తాయి అంటూ ఎదురు చూసి ….చూసి హమాలి లుగా జీవనం సాగిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో మా లాంటి నిరుద్యోగులు ఎంతో మంది ఉన్నారని, మరికొంత మంది ఆత్మహత్య లు కూడా చేసుకుంటున్నారని వారు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికైనా ఉద్యోగ నోటిఫికేషన్ ను విడుదల చేయాలని కోరారు.