ఉత్తరాఖండ్ భారీ వర్షాలు భయపెడుతున్నాయి. వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. డెహ్రాడూన్, రిషికేష్ హైవేలోని జఖాన్ నదిపై ఉన్న బ్రిడ్జి నీటి ప్రవాహం ధాటికి కుప్పకూలింది.
బ్రిడ్జి కూలిన సమయంలో దానిపై వాహనాలు ఉన్నాయి. అయితే ప్రయాణికులు ప్రమాదాన్ని ముందే గమనించడంతో ప్రాణ నష్టం తప్పింది. వాహనాలను బ్రిడ్జిపై వదిలేసి సేఫ్ ప్లేస్ కి చేరుకోగానే బ్రిడ్జి కూలింది. కొన్ని వాహనాలు అక్కడే చిక్కుకుపోగా.. మరికొన్ని నీటిలో కొట్టుకుపోయాయి.