వచ్చే నెల 8న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను బీజేపీ వెల్లడించింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను 57 స్థానాల్లో అభ్యర్ధులను ఖరారు చేసింది. వారిలో 11 మంది ఎస్సీలు కాగా..నలుగురు మహిళలు. ఢిల్లీలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో బీజేపీ నేత మనోజ్ తివారీ పేర్లను ప్రకటించారు. పేర్లు ప్రకటించిన జాబితాలో బీజేపీ ప్రముఖులు విజేందర్ గుప్తా (రోహిని నియోజకవర్గం), ఆప్ మాజీ ఎమ్మెల్యే కపిల్ మిశ్రా(మోడల్ టౌన్), శిఖా రాయ్(గ్రేటర్ కైలాస్), నీల్ కమల్ ఖత్రీ (నరేలా), సురేంద్ర సింగ్ బిట్టు(తీమర్ పుర్), విక్రమ్ బిదూరి(తుఘ్లకాబాద్), సుమన్ కుమార్ గుప్తా(చాందిని చౌక్), ఆశిష్ సూద్ (జనక్ పురి), రవి నేగి (పట్పర్ గంజ్)