ఏలూరులో వింత వ్యాధికి గల కారణాలను విశ్లేషించే పనిలో ఉన్న ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు కీలక రిపోర్ట్ ఇచ్చారు. ఎయిమ్స్- నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సహా ప్రఖ్యాత సంస్థల అభిప్రాయం ప్రకారం పురుగుమందుల అవశేషాలే ఏలూరు పరిస్థితికి కారణమని నిర్ధారించాయి.
అయితే, పురుగు మందుల అవశేషాలు ఎలా మనుషుల శరీరాల్లోకి ప్రవేశించాయన్న అంశంపై మరింత అధ్యయనం చేయాలని నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఆ బాధ్యతలను ప్రభుత్వం వారికే అప్పగించింది. ఇందుకోసం క్రమం తప్పకుండా ప్రతి జిల్లాలో ల్యాబులు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. క్రమం తప్పకుండా ఆహారం, తాగునీరు, మట్టి నమూనాలపై పరీక్షలు చేయాలని ఆదేశిస్తూ… ఫలితాలు ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్రంలో మరోచోట ఏలూరు వంటి ఘటనలు పునరావృతం కాకుండా సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయాన్ని ప్రొత్సహించాలన్నారు.