ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 22తో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించబోతుంది ఎన్నికల సంఘం. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ కొనసాగుతున్నారు. ఫిబ్రవరి 8న ఓటింగ్ జరగనుండగా, 11న ఫలితాలు వెల్లడించబోతున్నారు. ఒకే దశలో ఎన్నికల పోలింగ్ ఉండబోతుంది. జనవరి 14 నుండి నామినేషన్ల ప్రక్రియ మొదలవనుండగా 24వరకు కొనసాగుతాయి. జనవరి 28వరకు నామినేషన్ల ఉపసంహరించుకునే అవకాశం ఉంది.
ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో బీజేపీ, ఆప్, కాంగ్రెస్ హోరాహోరీ ప్రచారం నిర్వహించబోతున్నాయి.