ఢిల్లీలో ఆప్ మెజార్టీ స్థానాల్లో ముందంజలో ఉన్నప్పటికీ బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీకి మాత్రం గెలుపుపై ధీమా సడల లేదు. ఇంకా చాలా రౌండ్ల లెక్కింపు ఉన్నందున బీజేపీ కార్యకర్తలెవరూ కుంగిపోవద్దని కోరారు. మనం మంచి స్థానాల్లోనే ఉన్నామని..27 స్థానాల్లో బీజేపీ కంటే ఆప్ వెయ్యి ఓట్ల లీడింగ్ లోనే ఉందని తెలిపారు. ఏదైనా జరగొచ్చన్నారు. మొదటి నుంచి బీజేపీ ఢిల్లీలో కాషాయ జెండా ఎగురవేస్తుందని పదే పదే చెబుతున్న మనోజ్ తివారీ కౌంటింగ్ మొదలవ్వడానికి ముందు కూడా మొత్తం 70 నియోజకవర్గాల్లో 55 స్థానాలు బీజేపీవేనని అన్నారు. మేమే 48 కి పైగా స్థానాలను గెల్చుకుంటాం…55 గెలిచినా ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదు అన్నారు. ఆప్ మూడో సారి కూడా ఢిల్లీలో పాగా వేస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తివారి కొట్టి పడేశారు.