దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ అగ్నిప్రమాదం నెట్టింట వైరల్ అయ్యింది. ఇది బిల్డింగ్‌లో జరగ్గా అంతా చూస్తూ ఉండగానే క్షణాల్లో ఆ భవనం కుప్ప కూలిపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఉత్తర ఢిల్లీలోని రోషనారా రోడ్‌లోని మూడు అంతస్తుల బిల్డింగ్‌ను లాజిస్టిక్స్ సంస్థ జైపూర్ గోల్డెన్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగిస్తున్నది. అయితే నాటి ఉదయం 11.50 గంటలకు ఆ భవనంలో మంటలు చెలరేగాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 18 వాహనాలతో అక్కడకు చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. కాగా, అందరూ చూస్తుండగానే ఉన్నట్టుండి ఆ భవనం కుప్పకూలింది.
కేవలం ఐదు సెకండ్లలో ఆ బిల్డింగ్ పూర్తిగా నేలమట్టం అయ్యింది. ఆ భవనం చుట్టూ దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు.
లాజిస్టిక్స్ సంస్థ వినియోగించే బిల్డింగ్ కావడంతో అందులో ఎవరూ నివసించడం లేదని చెప్పారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదన్నారు.ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి కారణం ఏమిటన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు అగ్నిప్రమాదం జరిగిన కొన్ని సెకండ్లలోనే ఆ భవనం పూర్తిగా నేలమట్టం కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. స్పందించిన కొందరు నెటిజన్లు ఈ వీడియో క్లిప్ గురించి ఫన్నీగా కామెంట్లు చేశారు.
A massive fire broke out in a building at Raushan Ara roadin Delhi leading to its collapse. 18 fire tenders rushed to the spot to control the fire.
Reports @AlokReporter pic.twitter.com/28LVGNRqud
— The New Indian (@TheNewIndian_in) March 1, 2023