ఢిల్లీ జనాభా మొత్తానికి టీకా వేసేందుకు మూడు లేదా నాలుగా వారాలు చాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్రజైన్ ప్రకటించారు. ఢిల్లీలోని పాలీక్లినిక్స్, మొహొల్లా క్లీనిక్స్, డిస్పెన్సరీలు, ఆస్పత్రులు వంటి వైద్య సదుపాయాలను విస్తృతంగా వినియోగించడం ద్వారా ఇది సాధ్యమని ఆయన చెప్పారు.
ఒకసారి కరోనా టీకా అందుబాటులోకి వస్తే… ఢిల్లీ మొత్తానికి కొద్ది వారాల వ్యవధిలోనే టీకా వేయగలం అని ధీమా వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ నిల్వ గురించి ఆందోళన అవసరం లేదని, రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు జనాభా మొత్తానికి టీకా అందించే స్థాయిలో ఉన్నాయన్నారు. వ్యాక్సిన్ వచ్చాక తొలుత ఢిల్లీకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని కోరారు.
రాష్ట్రంలో కరోనా వేవ్ ఉన్నప్పటికీ… తాము ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నామన్నారు.