తాను బీజేపీ, కాంగ్రెస్ ఓటర్లకు కూడా ముఖ్యమంత్రినేని ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ”ఎన్నికలు ముగిశాయి…మీరు ఎవరికి ఓటేశారన్నది అనవసరం..మీరు నా కుటుంబంలో భాగం…ఎవరికైనా సేవ చేయాలనుకుంటే వారి పార్టీ నాకు అడ్డంకి కాలేదు” అన్నారు.
ప్రచారంలో రాజకీయాలు జరుగుతాయి..జరిగాయి..మీరు నాకు వ్యతిరేకంగా చేసిన దుష్ప్రచారాలన్నింటికి క్షమిస్తున్నాను…నాపైన ఉన్న వ్యతిరేక భావనలు తొలగించుకొమ్మని కోరుతున్నాను…ఢిల్లీ అభివృద్ధి కోసం మనం కలిసి పనిచేయాలి…కేంద్రంతో కూడా కలిసి పని చేయాలని కేజ్రీవాల్ తెలిపారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానిని కూడా ఆహ్వానించాను..ఆయన వేరే పనిలో బిజీగా ఉన్నట్టున్నారు. నాకు ప్రధాన మంత్రి, ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలు కావాలని ఈ వేదిక నుంచి కోరుతున్నానన్నారు.
”ప్రతి ఒక్కరు అంటున్నారు కేజ్రీవాల్ అన్నీ ఉచితం చేస్తున్నారని…ప్రపంచలో ఉత్తమమైనవన్నీ ఉచితమే, తల్లి ప్రేమ లాగా…కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలను ప్రేమిస్తారు..ఆ ప్రేమ కూడా ఉచితమే…నేను విద్యార్ధుల నుంచి, పేషెంట్ల నుంచి ఫీజు వసూలు చేస్తే సిగ్గుగా ఉంటుంది” అన్నారు.