ఢీల్లి అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దూకుడు పెంచారు. ప్రజాలవద్దకు నేరుగా వెళ్తూ సంక్షేమ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఢీల్లి బస్సు, మెట్రో సర్వీసులలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం నిన్నటి నుంచి ప్రారంభం అయ్యింది. ఈ పథకం వల్ల ఢీల్లి లోని మధ్యతరగతి మహిళ ఓటర్లు తనవైపు వస్తారు అనుకుంటున్న కేజ్రీవాల్ పథకం ఎలా ఉందో తెలుసుకోవడానికి స్వయంగా రంగంలోకి దిగారు. ఢిల్లీ లోని బస్సు, మెట్రో సర్వీసులలో ప్రయాణిస్తూ పథకం గురించి మహిళలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఉచిత ప్రయాణ పథకంపై ఢీల్లి మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు అని తన ట్విట్టర్ ద్వారా తెలిపారు ఢీల్లి సీఎం కేజ్రీవాల్.