ఎముకలు కొరికే చలిలో నెల రోజులుగా కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు అందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. కేంద్రం-రైతు సంఘాల నేతల మధ్య జరిగిన చర్చలు సఫలం కావటం లేదు. రైతులు తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న నేపథ్యంలో బీజేపీకి మరో షాక్ తగిలింది. మిత్రపక్షం శిరోమణి ఆకాళీదల్ ఇప్పటికే ఎన్డీఏ నుండి భయటకు రాగా, తాజాగా రాష్ట్రీయ లోక్ తంత్రిక్ పార్టీ కూడా బీజేపీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యింది. దీంతో ఈ నెల 29న ఉదయం 11గంటలకు రైతులతో చర్చించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తుంది.
రైతు ఉద్యమానికి మద్ధతుగా ఆప్ ఆధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఉద్యమం జరుగుతున్న ప్రాంతానికి వెళ్లనున్నారు. ఢిల్లీ సరిహద్దులోని కీర్తన్ దర్భార్ వద్ద రైతులను కలిసి సంఘీభావం తెలపనున్నారు. ఆదివారం సాయంత్రం కేజ్రీవాల్ రైతులను కలవనున్నట్లు ఆప్ ప్రకటన విడుదల చేసింది.
మరోవైపు సింఘు సరిహద్దు వద్దకు భారీ ఎత్తున రైతులు చేరకుంటున్నారు.