ఇటీవల పెట్రోల్ డీజిల్ ధరల పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాలు ఆయా రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగేలా వ్యాట్ ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. కానీ తెలుగు రాష్ట్రాలలో మాత్రం అటువంటి ఆలోచనలు చెయ్యలేదు ప్రభుత్వాలు. కాగా తాజాగా ఢిల్లీ ప్రభుత్వం ఇప్పుడు ఈ వ్యాట్ తగ్గించేందుకు ముందడుగు వేసింది.
లీటర్ పెట్రోల్ పై 8 రూపాయలు తగ్గించేందుకు రెడీ అయింది. ఇక ప్రస్తుతానికి లీటర్ పెట్రోల్ ధర 103 రూపాయల 97 పైసలు ఉంది. అలాగే హైదరాబాదులో చూసుకుంటే లీటర్ పెట్రోల్ ధర 108 రూపాయల 20 పైసలు ఉంది. అలాగే డీజిల్ ధర 94 రూపాయల 2 పైసలు ఉంది.