సీబీఐ డైరెక్టర్ ముడుపుల వ్యవహరంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి రాకేశ్ ఆస్తానా కేసు ఊహించని మలుపు తిరిగింది. రాకేశ్ ఆస్తానాకు లై డిటెక్టర్ పరీక్ష చేయమని కోర్టు ఆదేశించినా… సీబీఐ ఎందుకు పట్టించుకోవటం లేదంటూ న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సీబీఐ విచారణ అధికారికగా ఉన్న బస్సీని తనముందు ఈ నెల 28న హజరు కావాలని ఆదేశించారు.
హైదరాబాద్‌కు చెందిన సతీష్ సానా అనే వ్యాపారిపై జరుగుతున్న విచారణలో సీబీఐ ఆనాటి డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాకు లంచం ఇవ్వజూపరనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో రాకేశ్ ఆస్తానాకు సన్నిహితంగా ఉండే మనోజ్, సోమేష్ ప్రసాద్‌లతో 3 కోట్ల రూపాయాలు లంచం ఇచ్చారన్నది ఆరోపణ. ఇందుకోసం ప్రముఖ మాంసం వ్యాపారి మెయిన్ ఖురేషీ సహాయం చేశారని ఆరోపణలున్నాయి.
అయితే ఈ కేసులో తెలుగు రాష్ట్రాల్లో నాయకులైన సీఎం రమేష్‌తో పాటు, మాజీ మంత్రి షబ్బీర్‌అలీకి అప్పట్లో నోటీసులు అందటం సంచలనం రేపింది. అయితే, తమకు నోటీసులే అందలేని కొందరు, తాము ఎవరితోనూ మాట్లాడలేదని కొందరు ప్రకటించారు. కానీ కోర్టు ఇప్పుడు లై డిటెక్టర్ పరీక్షకు మొగ్గుచూపుతుండటంతో… తెలుగు రాష్ట్రాల నేతల పేర్లు బయటకు వస్తాయన్న టెన్షన్ నెలకొంది.