ఢిల్లీలో పాత ఎక్సైజ్ పాలసీపై ఆప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త మద్యం పాలసీని తయారు చేయాలని అధికారులను ఆదేశించింది. అంత వరకు పాత పాలసీనే అమలు చేయాలని నిశ్చయింది. ఈ క్రమంలో పాత పాలసీని మరో ఆరు నెలలు పొడిగించింది.

ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐకి ఫిర్యాదు చేశారు. కొత్త పాలసీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో పాత ఎక్సైజ్ పాలసీ మళ్లీ అమలులోకి వచ్చింది.
ఈ స్కామ్ కేసులో ఇప్పటి వరకు 10 మందికిపైగా అరెస్టయ్యారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతోపాటు ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొడుకు రాఘవరెడ్డి, పలువురు వ్యాపారవేత్తలు ఈ కేసులో జైళ్లో వున్నారు. ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను రేపు విచారించనున్నారు.