పరీక్షలపై విద్యార్థులతో ఢిల్లీ విద్యాశాఖ కార్యదర్శి ఉదిత్ రాయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన విద్యార్థులతో క్లాస్ రూంలో మాట్లాడుతూ… ఏదో ఒకటి రాసి పేపర్లు నింపండి అంటూ కామెంట్ చేశారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మీకు సమాధానాలు తెలియకపోవచ్చు. కానీ ఏదో ఒకటి రాయండి… ప్రశ్నలే మళ్లీ కింద నింపినా అభ్యంతరం లేదు. కానీ జవాబు పత్రాలు మాత్రం ఖాళీగా ఉంచొద్దు, మీ ఉపాధ్యాయులతో మేము మాట్లాడాము అని కామెంట్ చేశారు. మీరు ఏదో ఒక జవాబు రాస్తే సరిపోతుందన్నారు. మీరు ఏది రాసినా మార్కులు వేయమని సీబీఎస్ఈకి కూడా చెప్పాను అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
केजरीवाल जी ये कैसा शिक्षा मॉडल है आपका
दिल्ली के शिक्षा निदेशक उदित प्रकाश बच्चों को बता रहे है अगर पेपर में कुछ न आये तो उत्तर की जगह प्रशन ही लिख दो
हमने CBSE से बात कर रखी है नम्बर मिल जाएंगे।
बच्चों के भविष्य से खिलवाड़ बंद कीजिए@ArvindKejriwal @msisodia #बर्बादी_के_6_साल pic.twitter.com/31D2BrS0wx— Delhi Congress (@INCDelhi) February 18, 2021