శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి ఢిల్లీ, ఢిల్లీ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే విమానాలు నిలిచిపోయాయి. ఢిల్లీలో భారీగా పొగమంచు ఉండటంతో ల్యాండింగ్ సమస్య ఉత్పన్నం కావటం ఓ కారణమైతే, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రన్‌వే పై కూడా సాంకేతిక సమస్య తలెత్తటంతో… విమానాలు టేకాఫ్ కాలేదు.
దాంతో ఢిల్లీకి వెళ్లాల్సిన పలువురు ప్రముఖులు ఎయిర్‌పోర్ట్‌లోనే నిరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో చత్తీస్‌ఘడ్ గవర్నర్ సహ పలువురు న్యాయమూర్తులు, రాజకీయ ప్రముఖులు ఉన్నారు. అయితే, ఎప్పట్లోపు సమస్య పరిష్కారం అవుతుందో ఎయిర్‌పోర్ట్ అధికారులు సరైన జవాబు కూడా ఇవ్వట్లేదని సమాచారం.