ఢిల్లీలో జరిగిన మత ప్రార్ధనలకు హాజరైన వారిలో చాలామందికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అవుతుండటంతో ఢిల్లీ సర్కార్ అలర్ట్ అయింది. దీంతో ప్రార్ధనలు జరిగిన చోటును పోలీసులు జల్లెడ పడుతున్నారు. అనుమానితులను పోలీసులు వైద్య సిబ్బందితో కలిసి క్వారెంటైన్ కు తరలిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం, సోమవారం రెండో రోజుల్లోనే ఏకంగా 1600 మందిని క్వారెంటైన్ కు తరలించారు. ఇందులో 11 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ కావడం హస్తినలో కలకలం రేపుతోంది. దాదాపు 300 మంది వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. నిజాముద్దీన్ దర్గా చుట్టూ పక్కల ప్రాంతంలో పోలీసులు కార్దన్ సెర్చ్ చేపట్టి భారీ సంఖ్యలో జనాలను క్వారెంటైన్ కు తరలించారు.
ఏపీ,తెలంగాణతో సాహా పలు రాష్ట్రాల్లో కరోనా బారినపడ్డవారిలో చాలామంది ఢిల్లీలోని ఈ ప్రాంతంలో జరిగిన మత ప్రార్ధనలకు హాజరైనట్లు తేలడంతో..పోలీసులు వేట ప్రారంభించారు. ఇటీవల కరోనాతో మరణించిన జమ్మూ కాశ్మీర్ వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చి ప్రార్ధనలు చేసి వెళ్లినట్టుగా సమాచారం. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆదివారం కరోనా లక్షణాలతో వున్న 200 మందిని క్వారెంటైన్ కు తరలించగా..తాజాగా సోమవారం 1400మందిని క్వారెంటైన్ కు తరలించారు. దీంతో నిజాముద్దీన్ ప్రాంతంలో మత ప్రార్ధనలకు ఎవరెవరు హాజరయ్యారని పోలీసులు ఆరా తీస్తున్నారు.
నిజాముద్దీన్ ప్రాంతంలో కొనసాగుతున్న పోలీసుల భారీ కార్డెన్ సర్చ్ నిర్వహించారు.మత ప్రార్థనల కోసం వచ్చిన 11 మంది ఇడొనేషియా వాసులు సైతం ఇక్కడికే వచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రార్థనలకు హాజరైన వారిలో అనేక మందికి కరోనా లక్షణాలు ఉన్నాయని సందేహం వ్యక్తం చేస్తున్నారు. నిజాముద్దీన్ ప్రాంతంలో డ్రోన్ కెమెరాలతో పోలీసులు పర్యవేక్షిస్తూ…ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతూ ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి పై వాకబు చేస్తున్నారు. దర్గాలో జరిగిన ప్రార్ధనలకు హాజరైన వారందరినీ బస్సులలో “క్వారెంటైన్” ను కు తరలించారు.