కరోనా మహమ్మారి తాకిడికి తట్టుకోలేక దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు నివారణ చర్యలు చేపట్టాయి. కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు విధించారు. అందులో భాగంగా దేశరాజధాని ఢిల్లీలో క్రమంగా పెరుగుతున్న కేసుల దృష్ట్యా.. నైట్ కర్ఫ్యూ వింధించారు అధికారులు.
కర్ఫ్యూ కారణంగా కోవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో అమలులో ఉన్న వీకెండ్ కర్ఫ్యూను ఎత్తి వేసింది. 50శాతం సామర్థ్యంతో ప్రైవేటు కార్యాలయాలకు అనుమతి ఇచ్చింది ఢిల్లీ ప్రభుత్వం.
ఢిల్లీలో ఇప్పటి వరకు షాపులకు ఉన్న సరి బేసి సంఖ్య విధానాన్ని రద్దు చేసింది. ప్రతిపాదనను ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ కు పంపించింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కర్ఫ్యూను ఎత్తివేసినట్టు పేర్కొంది.
ఢిల్లీలో కరోనా కేసులు పెరగడంతో వీకెండ్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం జనవరి 4న ప్రకటించింది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు వీకెండ్ కర్ఫ్యూ అమలు చేసింది. అంతకుముందే ఆప్ ప్రభుత్వం ఢిల్లీలో ఎల్లో అలర్ట్ ను అమలు చేసింది.