కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ మేనకా గాంధీకి ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీచేసింది. వెటర్నరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధించి ఈ సమన్లను హైకోర్టు పంపింది.
ఈ పిటిషన్ పై ఆగస్టు 4 విచారణ చేపట్టనున్నట్టు జస్టిస్ అమిత్ భన్సాల్ వెల్లడించారు. ఈ పిటిషన్ పై 30 రోజుల్లోగా లిఖిత పూర్వక సమాధానాన్ని ఇవ్వాలని మేనకాగాంధీని హైకోర్టు ఆదేశించింది.
మేనకా గాంధీ తమను వేధిస్తున్నారని, తమ దగ్గర నుంచి అక్రమంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వెటర్నరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు ఆరోపించారు. దీంతో పాటు ఆమెపై వారు పరువు నష్టం దావా దాఖలు చేశారు.
ఫోన్ లో తమతో మేనకా గాంధీ అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించారని పిటిషనర్లు పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రిగా ఆమె తనకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి తమను ఇబ్బందులు పెడుతున్నారని వారు పిటిషన్ లో పేర్కొన్నారు.