యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) గుర్తింపు రద్దు కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆ పార్టీని రద్దు చేసి.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పేరు వాడకుండా చర్యలు తీసుకోవాలని ..ఇటీవలే అన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని ఈసీకి, వైసీపీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు కూడా పంపింది. కానీ ఇప్పటివరకు ఈసీ గానీ, వైసీపీ కౌంటర్ దాఖలు చేయలేదని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే కేసు వాయిదా కోరే ఉద్దేశ్యంతోనే వైసీపీ, ఈసీ ఇంకా స్పందించలేదని సమాచారం. ఈ క్రమంలో నేడు ఢిల్లీ హైకోర్టులోజరగనున్న విచారణపై ఆసక్తి నెలకొంది.