ఐ.ఎన్.ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరంకు బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ నెల 5న ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, చిదంబరం తరపు న్యాయవాదుల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్ కైత్ తీర్పును రిజర్వ్ లో ఉంచి ఈరోజ వెల్లడించారు. మనీ లాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అక్టోబర్ 16 వ తేదీన చిదంబరం ను అరెస్ట్ చేశారు. అంతకు ముందు ఆగస్ట్ 21 న ఐ.ఎన్.ఎక్స్ మీడియా అవినీతి కేసులో సీబీఐ చిదంబరం ను అరెస్ట్ చేసింది. చిదంబరం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా అక్టోబర్ 22న సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.