– 2020 సెప్టెంబర్ నుంచి మే 2021 వరకు ఢిల్లీ మద్యం పాలసీ కొత్త విధానం తయారు.. ఎక్సైజ్ కమిషనర్ రవి ధావన్ తో కమిటీ.. తర్వాత కేబినేట్ సమావేశాలు.. పాలసీ విధానం తయారు.. మంత్రివర్గం ఆమోదం వంటివి జరిగాయి.
– 2021 నవంబర్ 8న లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా లిక్కర్ పాలసీ విధానంపై మొదటిసారిగా ఆరోపణలు చేశారు.
– 2022 జులై 20న కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు లిక్కర్ పాలసీపై లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ రాశారు.
– జులై 22న సీబీఐకి లేఖ రాశారు ఎల్జీ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోరారు.
– ఆగస్ట్ 17న సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. 15 మంది పేర్లను నిందితులుగా చేర్చింది. ఈడీ ఒక్కరోజు వ్యవధిలోనే కేసును టేక్ ఓవర్ చేసుకుంది.
– సెప్టెంబర్ 5, 6, 7 తేదీల్లో హైదరాబాద్ లోని 6 ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరిగాయి.
– సెప్టెంబర్ 17, 18 తేదీల్లో ఎమ్మెల్సీ కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఆఫీస్ లో సోదాలు చేశారు అధికారులు.
– సెప్టెంబర్ 21న అరబిందో ఫార్మా అధినేత శరత్ చంద్రారెడ్డిని విచారించింది ఈడీ.
– అక్టోబర్ 7, 8 తేదీల్లో హైదరాబాద్ మీడియా సంస్థల్లో సోదాలు జరిగాయి.
– అక్టోబర్ 10న బోయినపల్లి అభిషేక్ రావును సీబీఐ అరెస్ట్ చేసింది.
– అక్టోబర్ 12న ఆంధ్రప్రభ ఎండీ ముత్తా గౌతమ్ అరెస్ట్ అయ్యారు.
– అక్టోబర్ 17న ఢిల్లీ డిప్యూటీ సీఏం సిసోడియాను ప్రశ్నించింది సీబీఐ.
– నవంబర్ 10న శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేసింది ఈడీ.
– నవంబర్ 14న అప్ కి చెందిన విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లిని సీబీఐ కేసులో బెయిల్ రాగానే ఈడీ అరెస్ట్ చేసింది.
– నవంబర్ 16న దినేష్ అరోరా అప్రూవర్ గా మారడానికి రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతి.
– నవంబర్ 25న 10 వేల పేజీలతో సీబీఐ తొలి చార్జీషీట్.
– నవంబర్ 26న ఈడీ మొదటి చార్జీషీట్ దాఖలు.
– నవంబర్ 29న అమిత్ అరోరాను ఈడీ అరెస్ట్ చేసింది. అదేరోజు కవిత పేరును రిమాండ్ రిపోర్టులో 25 సార్లు ప్రస్తావించింది. 10 సెల్ ఫోన్స్ వాడారని ధ్వంసం చేశారని కోర్టుకు నివేదించింది.
– డిసెంబర్ 6న కవితకు సీబీఐ నోటీసులు.
– డిసెంబర్ 11న కవితను విచారించింది సీబీఐ. సీఆర్పీసీ 191 కింద నోటీసులు జారీ.
– 2023 జనవరి 6న ఈడీ రెండో చార్జీషీట్ దాఖలు చేసింది. ఇందులో సీఎం కేజ్రీవాల్.. సమీర్ మహేంద్రతో మాట్లాడినట్లు ఆధారాలతో సహా ప్రస్తావించింది.
– నెల రోజులు 118 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన డేటాను ఎనలైజ్ చేసుకున్నాక ఈ విషయాన్ని బయటపెట్టింది.
– ఫిబ్రవరి 8న కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసింది.
– ఫిబ్రవరి 18న సిసోడియాకు సీబీఐ నోటీసులు
– ఫిబ్రవరి 25న సమీర్ మహేంద్ర, విజయ్ నాయర్, దినేష్ అరోరా, అమిత్ అరోరా, అరుణ్ రామచంద్ర పిళ్లై ఆస్తులను జప్తు చేసింది ఈడీ.
– ఫిబ్రవరి 26న 8 గంటల పాటు మనీష్ సిసోడియాను విచారించి సాయంత్రం అరెస్ట్ చేసింది సీబీఐ.
– మార్చి 7న అరుణ్ రామచంద్ర ఫిళ్లైని ఈడీ అరెస్ట్ చేసింది. 7 రోజుల కస్టడీ విధించింది కోర్టు. రిమాండ్ రిపోర్ట్ లో పిళ్లై.. కవిత బినామీయే అని పేర్కొంది ఈడీ.
– మార్చి 8న కవితకు ఈడీ నోటీస్ పంపంది. 9 తేదీన విచారణకు రావాలని ఆదేశించింది.