ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా ముఖ్య అనుచరుడి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. దినేష్ అరోరా నివాసం, కార్యాలయాలతో పాటు అతని స్నేహితుల ఇండ్లలో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు.
లిక్కర్ స్కాంలో ఆయన ఏ 11గా ఉన్నారు. దినేష్ అరోరాకు చెందిన బ్యాంకు ఖాతాల్లోకి రాధాకృష్ణ ఇండస్ట్రీ ద్వారా సమీర్ మహేంద్రు భారీగా నగదు బదిలీ చేసినట్టు ఆరోపణలు వున్నాయి. సుమారు రూ. కోటి వరకు బదిలీ చేసిన్నట్టు ఆరోపణలు వచ్చాయి.
ఇప్పటికే దినేష్ అరోరాపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ డబ్బును డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు దినేష్ అరోరా ఇచ్చినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. లిక్కర్ స్కాంలో సమీర్ మహేంద్రు, అర్జున్ పాండే, విజయ్ నాయర్, రామచంద్రపిళ్లైలు రూ. 5 కోట్లు బదిలీ చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.
ఈడీ కస్టడీలో ఉన్న సమీర్ మహేంద్రు స్టేట్‌మెంట్‌తో హైదరాబాద్‌లో నాలుగు చోట్ల ఈడీ సోదాలు చేస్తోంది. తెలంగాణతో పాటు ఢిల్లీ, పంజాబ్ లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం నుంచి ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.