ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితులకు కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ నెల 7 వరకు వారికి జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తున్నట్టు న్యాయస్థానం ప్రకటించింది. ఈ కేసులో నలుగురు నిందితులు శరత్ చంద్రారెడ్డి, బినోయ్‌బాబు, విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి జ్యుడిషియల్ కస్టడి ఈ రోజుతో ముగియాల్సి వుంది.
ఈ నేపథ్యంలో వారిని సీబీఐ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెట్టారు. వారికి జ్యుడిషియల్ కస్టడీని పొడగించాలని ఈడీ అధికారులు న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. నిందితుల కస్టడీని పొడిగిస్తున్నట్టు వెల్లడించింది.
ఇక ఈ కేసులో జనవరి5న ఛార్జీషీట్ దాఖలు చేసేందుకు ఈడీ రెడీ అవుతోంది. అంతకు ముందు ఈ కేసులో ఈడీ ఒక చార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఈ స్కామ్‌లో ఇండోస్పిరిట్ కంపెనీ నిర్వాహకుడు సమీర్ మహేంద్రు పాత్రపై 181 పేజీలతో ఈ కొత్త చార్జిషీట్‌ను దాఖలు చేసింది.
ఈ చార్జిషీట్‌లో టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత , మాగుంట రాఘవ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అరుణ్ రామచంద్ర పిళ్లై, ఎం.గౌతమ్, బోయినపల్లి అభిషేక్ రావు పేర్లను ఈడీ పేర్కొంది. చార్జిషీట్ లోని 95, 96, 125వ పేజీల్లో కవిత పేరును ఈడీ ప్రస్తావించింది.