దేశరాజధాని ఢిల్లీలో దారుణం చోటు చోటు చేసుకుంది. ఇంటి ముందు కుక్క మూత్రం పోసిందని ఓ వ్యక్తి ఆగ్రహం చెందాడు. ఆ కుక్క యజమానిపై యాసిడ్ దాడి చేశాడు. దీంతో దాడికి పాల్పడిన తండ్రి, కుమారున్ని పోలీసులు అరెస్టు చేశారు. ఘటన వివరాల్లోకి వెళితే…
పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ఏరియాలో ఓ వ్యక్తి(50)తన కుక్కను తీసుకుని వాకింగ్‌కు వెళ్లాడు. పొరుగు వ్యక్తి కమల్ ఇంటి ముందు కుక్క మూత్రం పోసింది. ఇదంతా బిల్డింగ్ పైనుంచి కమల్ గమనించాడు. కుక్క యజామానితో కమల్ గొడవకు దిగాడు. దీంతో మాటా మాటా పెరిగింది.
ఈ క్రమంలో కమల్ కొడుకులిద్దరూ అక్కడకు చేరుకున్నారు. కుక్క యజమానితో వారు గొడవ పడ్డారు. ఇంతో కమల్ టాయిలెట్స్ కడిగే యాసిడ్ తీసుకు వచ్చి మొదటి అంతస్తు మీద నుంచి కుక్క యజమానిపై పోశాడు. దీంతో కుక్క యజమానికి తీవ్రగాయాలయ్యాయి.
అతన్ని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. కుక్క యజమాని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం కమల్‌ను, అతని కొడుకులు రోహిత్, హిమాన్షును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.