సిటీలైప్ లో..బ్యాచిలర్ బిజీ జీవితానికి వంట ఒక సమస్య. బ్రెడ్డు, బిస్కెస్ట్స్ తో ఆ పూటని సరిపెట్టకుండా ఇష్టమైన ఫుడ్, ఇష్టమైన హోటల్స్ లో ఇంటికి తెచ్చిపెడుతున్నాయి ఫుడ్ యాప్స్. ఒకప్పుడు తప్పక తినేవారు ఇప్పుడు తినక తప్పడం లేదు.
ప్రస్తుతం సిటీలు, పల్లెటూళ్ళు అని తేడాలేకుండా, బ్యాచిలర్స్ ఫ్యామిలీస్ అని డిఫరెన్స్ లేకుండా దగ్గరైపోయాయి ఫుడ్ యాప్స్. అలాంటి వాటిలో జొమేటో ఫుడ్ యాప్ ఒకటి. అయితే ఇటీవల జొమాటో ఈ ఏడాది తన ఫుడ్ డెలివరీ యాప్ పై ఆర్డర్లకు సంబంధించి ఆసక్తికర విషయాలను (వార్షిక నివేదిక) వెల్లడించింది.
బిర్యానీ కోసమే అత్యధిక ఆర్డర్లు వచ్చాయి. ఇటీవల స్విగ్గీ సైతం తన ప్లాట్ ఫామ్ పై ఆర్డర్ల పరంగా బిర్యానీ నంబర్ 1 స్థానంలో ఉన్నట్టు ప్రకటించడం తెలిసిందే. జొమాటో యాప్ పై ప్రతి నిమిషానికి 186 బిర్యానీ ఆర్డర్లు వచ్చాయి. స్విగ్గీ ఒక నిమిషానికి 137 బిర్యానీ ఆర్డర్లను పొందడం గమనార్హం.
జొమాటోలో ఈ ఏడాది ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి 3300 ఆర్డర్లు ఇచ్చి టాప్ కస్టమర్ గా నిలిచాడు. అంటే రోజుకు 9 ఆర్డర్లు ఇచ్చినట్టు అయింది. ఇక డిస్కౌంట్ ప్రోమో కోడ్ లను ఉపయోగించుకునే విషయంలో పశ్చిమబెంగాల్ లోని రాయ్ గంజ్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 99.7 శాతం కస్టమర్లు డిస్కౌంట్ ప్రోమో కోడ్ తోనే ఈ ఏడాది ఆర్డర్ చేశారు.
ముంబైకి చెందిన ఓ కస్టమర్ ప్రోమో కోడ్ లను అప్లయ్ చేయడం ద్వారా ఈ ఏడాది జొమాటో ఆర్డర్లపై రూ.2.43 లక్షలను ఆదా చేసుకున్నాడు. బిర్యానీ తర్వాత జొమాటో యాప్ పై పిజ్జా కోసం ఎక్కువ మంది ఆర్డర్ చేశారు. ప్రతి నిమిషానికి 139 పిజ్జా ఆర్డర్లు వచ్చాయి.