వివాహేతర సంబంధాల మోజులో పడి జనాలు తమ సంసారాల్ని నాశనం చేసుకుంటున్నారు. తమతో జీవితాంతం కలిసి ఉండాల్సిన భాగస్వాముల్ని చంపుకుంటున్నారు. తాజాగా మరో వివాహేతర సంబంధం వెలుగులోకి వచ్చింది. ప్రియురాలి కోసం ఆమె భర్తను దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని వజీరాబాద్ కు చెందిన మునిషద్దీన్, రషీద్ లు స్నేహితులు. వీరిద్దరూ ప్లంబర్, ఎలక్ట్రీషియన్ గా కలిసి పని చేసేవారు. వారు ఒకరి ఇళ్లకు మరొకరు వెళ్లేవారు. అందులోనూ రషీద్ తన భార్యను మద్యం సేవించి కొట్టేవాడు. ఈ క్రమంలో మునిషద్దీన్ తో రషీద్ భార్య పరిచయం పెంచుకుంది. అదికాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది.
దీంతో మునిషద్దీన్, మహిళ రషీద్ హత్యకు కుట్ర పన్నారు. గత 10-15 రోజుగా రషీద్ ను వదిలించుకోవాడిని మునిషద్దీన్ పై మహిళ ఒత్తిడి తీసుకొచ్చేది. దీంతో ఒక రోజు ప్లాన్ చేసి.. మునిషద్దీన్ రషీద్ ను రామ్ ఘాట్ కు తీసుకెళ్లి అక్కడ మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న రషీద్ ను పొడిచి చంపాడు. అనంతరం గొంతుకోసి మృతదేహాన్ని తగుల పెట్టాడు.
ఆ తర్వాత హత్యకు సంబంధించిన సాక్ష్యాధారాలను, గుర్తింపులను నిందితులు ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. కొన్ని రోజుల తర్వాత రషీద్ కనిపించడం లేదని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేయగా అసలు నిందితులు బయట పడ్డారు.