ఈ మధ్య కాలంలో ఫుడ్ డెలివరీ యాప్ లు ఎక్కువయ్యాయి. కస్టమర్లు ఏ టైమ్ లో ఆర్టర్ పెట్టినప్పటికీ డెలివరీ బాయ్స్ వాటిని ఎన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ వాటిని కస్టమర్ల వద్దకు చేరుస్తున్నారు. కానీ కొందరు కస్టమర్లు డెలివరీ బాయ్స్ కష్టాల గురించి పట్టించుకోకుండా వారి మీద విరుచుకుపడుతుంటారు.
కానీ దేశ రాజధాని నగరంలో మాత్రం ఓ కస్టమర్ డెలివరీ బాయ్ కు స్వాగతం పలికిన విధానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఢిల్లీలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. ఆ జోరు వానలో బయటకు వెళ్లే వీలు లేక ఓ కస్టమర్ జొమాటో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాడు. అయితే ఆ ఆర్డర్ తీసుకుని సదరు జొమాటో డెలివరీ బాయ్.. ఓ గంట ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. అటు వర్షం.. ఇటు పండుగ కావడంతో ట్రాఫిక్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటూ జొమాటో డెలివరీ బాయ్ ఎట్టకేలకు ఫుడ్‌ను డెలివరీ చేశాడు.
డెలివరీ బాయ్ ఇంటికి రాగానే ఆ కస్టమర్ వినూత్నంగా స్వాగతం పలికాడు. ఫుడ్ డెలివరీ బాయ్ కుమార్.. తమ ఇంటి దగ్గరకు వచ్చిన వెంటనే కస్టమర్.. డెలివరీ బాయ్‌కు బొట్టుపెట్టి.. హారతి ఇచ్చి స్వాగతం పలికాడు. దీంతో కుమార్ షాకయ్యాడు. కానీ నవ్వుతూ బొట్టు పెట్టించుకున్నాడు.
దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. డెలివరీ బాయ్స్ కూడా మనుషులే ఆ కస్టమర్‌ది గొప్ప మనస్సు అని ఒకరు కామెంట్ చేయగా.. డెలివరీ బాయ్‌లు కూడా మనుషులే అని అర్థం చేసుకోవాలని మరొకరు కామెంట్ చేశారు.