ప్రపంచంలో కల్లా అత్యంత కాలుష్య దేశంగా బంగ్లాదేశ్ నిలిచింది. ప్రపంచ గాలి నాణ్యత-2021ని ఐక్యూ ఎయిర్ అనే స్విట్జర్ లాండ్ కు చెందిన సంస్థ విడుదల చేసింది.
ఆ నివేదిక ప్రకారం.. బంగ్లాదేశ్ తర్వాత అత్యంత కాలుష్యం కలిగిన దేశాల జాబితాలో చాద్ రెండో స్థానంలో నిలిచింది. పాకిస్తాన్, తజకిస్తాన్, ఇండియాలు మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నాయి.
ఇక నగరాల పరంగా చూస్తే ప్రపంచంలో కెల్లా అత్యంత కాలుష్య నగరంగా న్యూఢిల్లీ వరుసగా రెండోసారి అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో బంగ్లా దేశ్ రాజధాని ఢాకా ఉంది.
చాద్ రాజధాని అంజమేనా, తజకిస్తాన్ రాజధాని దుషాంబే, మస్కట్ రాజధాని ఓమన్ లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మధ్య, దక్షిణ ఆసియాలో అత్యంత కలుషితమైన 15 నగరాల్లో 12 భారత్ నుంచే ఉన్నాయి.