పంజాబ్ లో సంచలనం సృష్టించిన సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మసావాలే హత్య కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య కేసులో ప్రధాన షూటర్లుగా భావిస్తున్న ఇద్దరిని అదుపులోనికి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గుజరాత్ లోని ముంద్రా ప్రాంతంలో వీరిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వారి దగ్గర నుంచి పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
వీరిద్దరు ప్రియావ్రత్ ఫౌజీ, సంతోష్ జాదవ్ లుగా తెలిపారు. ఫౌజీ గ్యాంగ్ స్టర్. ప్రస్తుతం రాంకరణ్ గ్యాంగ్ లో పనిచేస్తున్నారు. ముసావాలే హత్య కేసులో ఇతర షూటర్లకు ఇతనే ఆదేశాలు ఇచ్చాడు. గతంలో జరిగిన రెండు హత్యలోనూ ఫౌజీ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Advertisements
మరో షూటర్ సంతోష్ నుంచి పర్మిషన్ లేని 13 తుపాకులను, 8 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.