సోషల్ మీడియాలో బాయ్స్ లాకర్ రూం అనే గ్రూప్ చాట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఢిల్లీకి చెందిన కొందరు స్కూల్ విద్యార్థులు బాయ్స్ లాకర్ రూం అనే ఇన్ స్టాగ్రాం గ్రూపులో అమ్మాయిల మార్ఫింగ్ ఫోటోలు షేర్ చేస్తూ, గ్యాంగ్ రేప్ కు ప్లాన్ చేస్తున్న చాట్స్ ట్విట్టర్ లో వైరల్ గా మారటంతో ఆ గ్రూప్ అడ్మిన్, సభ్యులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
14-17 సంవత్సరాల వయస్సు ఉన్న వీరు తమతో గతంలో చదువుకున్న ఓ అమ్మాయి ఫోటోలను మార్ఫ్ చేసి.. షేర్ చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ మొత్తం విషయంపై ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదు.
మరోవైపు సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై ఢిల్లీ మహిళా కమీషన్ సీరీయస్ అయ్యింది. సుమోటోగా కేసును స్వీకరించిన కమీషన్ దీనిపై పోలీసులు ఇంతవరకు ఏం చర్యలు తీసుకున్నారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు అన్న అంశాలపై మే 8వరకు పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఇక ఇన్స్టా ను కూడా ఇందులో ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఇలాంటి వాటి నిరోధానికి తీసుకుంటున్న చర్యల వివరాలను కోరింది.