పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్ బాగ్ లో దాదాపు నెల రోజులుగా నిరసన తెలుపుతున్న వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పోలీసులు అమలు చేస్తున్నారు. అయితే వారిని ఒప్పించి ఖాళీ అక్కడి నుంచి ఖాళీ చేయించాలి తప్ప బలప్రయోగం చేయొద్దని హైకోర్టు పోలీసులకు స్పష్టంగా చెప్పింది. వందలాది మంది షహీన్ బాగ్ లో నిరసనకు కూర్చోవడంతో ఢిల్లీలోని ముఖ్యమైన షహీన్ బాగ్-కాలింది కుంజ్ రోడ్ బ్లాక్ అయ్యింది. ఇక్కడి నుంచే ఫరీదాబాద్ , నోయిడాకు రోడ్డు కనెక్ట్ అవుతుంది. దీని కారణంగా ట్రాఫిక్ జామ్ అయి ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారించిన కోర్టు వారిని అక్కడి నుంచి తొలగించాలని ఆదేశించింది. అయితే వారిని తొలగించేటప్పుడు శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని కోరింది. దీంతో పోలీసులు మత పెద్దలతో మాట్లాడి వారిని అక్కడి నుంచి తొలగించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » షహీన్ బాగ్ నిరసనకారులను ఒప్పించండి : ఢిల్లీ హైకోర్ట్