దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కప్పేసింది. ఇప్పటికే అక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా… ఒక్కసారిగా పొగమంచు కప్పేయటంతో పలు విమాన సర్వీసులు, రైల్వే సేవలకు అంతరాయం ఏర్పడింది.
ఇప్పటికే నాలుగు విమానాలు రీ షెడ్యూల్ కాగా, మరో విమానం రద్దైందని ఢిల్లీ అంతర్జాతీయ విమనాశ్రయం అధికారులు ప్రకటించారు. ఢిల్లీలోని పలు ప్రాంతాలు పూర్తిగా కనపడకుండా తయారయ్యాయి. ఏయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో ప్రమాణాలు 492కు పడిపోయినట్లు అధికారులు తెలిపారు.
CAT IIIA, CATIII B విమానాలు మాత్రమే ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్వీసులు కొనసాగిస్తాయని, ప్రయాణికులు ముందుగానే తమ విమానయాన సంస్థతో మాట్లాడి ప్రయాణాలు సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. ఢిల్లీ సప్దర్ గంజ్ ప్రాంతంలో అత్యల్పంగా 8.6డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని… మరో రెండ్రోజుల్లో ఇవి మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇక ఉత్తరాధిలో రానున్న రెండు-మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2-3డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉందని… ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.