వెటర్నరీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అయితే… దిశ నిందితులు పది రోజుల వ్యవధిలోనే ఎన్‌కౌంటర్‌లో హతమవ్వటంతో దిశకు సత్వర న్యాయం జరిగిందని చర్చ నడుస్తోంది. దిశ కుటుంబానికి కొంతైనాన్యాయం జరిగిందని, నిర్భయ ఘటన జరిగి 7 సంవత్సరాలు అయినా… నిందితులను జైల్లలో మెపుతున్నారని ఢిల్లీలో నిరసనలు మొదలయ్యాయి. హైదరాబాద్‌లో సత్వర న్యాయం జరిగింది, నిర్భయకు ఇంకా ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు. నిర్భయ నిందితుల ఎన్‌కౌంటర్ ఇంకెప్పుడు అంటూ నిరసన ప్రదర్శన చేశారు.
ఎన్‌కౌంటర్‌పై టాలీవుడ్ రియాక్షన్
ఎన్‌కౌంటర్‌పై యాసిడ్ బాధితురాలు రియాక్షన్
అయితే, ఇలాంటి ఎన్‌కౌంటర్లతో కొంత ఉపశమనం మాత్రమే దొరుకుతుందని, కఠిన చట్టాలు చేయటం… వాటిని అంతే కఠినంగా అమలు చేసినప్పుడే సరైన న్యాయం చేసినట్లు అంటూ మహిళలు స్పష్టం చేస్తున్నారు.