ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం హిమాచల్ ప్రదేశ్ లో పర్యటించారు. ఆయన పర్యటనలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో రోడ్డు షోలో ఆయన పాల్గొన్నారు.
ప్రధాని రాక సందర్బంగా రోడ్డుకు ఇరు వైపులా జనాలు నిలబడ్డారు. వారికి అభివాదం చేస్తూ ప్రధాని మోడీ స్పీడుగా ముందుకు సాగారు. ఆ సమయంలో ప్రధాని తన కాన్వాయ్ ను ఒక్కసారిగా ఆపారు. కారు నుంచి దిగి జనం వైపునకు నడవడం మొదలు పెట్టారు.
ప్రధాని మోడీ ఎటు వెళ్తున్నారని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. బారికేడ్లకు అవతల జనలంలో నిలుచున్న ఓ బాలిక వద్దకు ప్రధాని మోడీ వెళ్లారు. ఆమె చేతిలో ఉన్న పెయింటింగ్ ను ప్రధాని మోడీ తీసుకున్నారు.
కాన్వాయ్ లో వెళుతున్న సమయంలో ఆ బాలిక చేతిలో మోడీ తన తల్లి ఫోటోను గమనించి ఒక్క సారిగా ఆగిపోయారు. తన తల్లి పెయింటింగ్ ను అత్యధ్భుతంగా గీసిన బాలికకు ఆయన తన ఆశీర్వాదం ఇచ్చారు.