న్యూజిలాండ్ లో మళ్లీ కరోనా కేసు బయటపడడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. మూడు రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించింది. ప్రస్తుతం నమోదైన కేసు డెల్టా వేరియంట్ గా గుర్తించారు. దాదాపు ఆరు నెలల తర్వాత న్యూజిలాండ్ లో తొలి కరోనా కేసు బయటపడింది.
వచ్చింది ఒక్క కేసే అయినా ఛాన్స్ తీసుకోదలుచుకోలేదని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ తెలిపారు. మూడు రోజుల లాక్ డౌన్ తో పాటు.. కరోనా కేసు బయటపడ్డ ఆక్లండ్… దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వారం రోజుల పాటు ఆంక్షలు విధించినట్లు చెప్పారు. కఠినమైన నిర్ణయాల వల్లే కరోనాను కట్టడి చేయగలిగామని గతంలో పెట్టిన ఆంక్షల్ని గుర్తు చేశారామె.