ఏపీలోని అమరావతిలో రోడ్లను దుండగులు మాయం చేస్తున్నారు. తాజాగా లింగరాయ పాలెంలో రోడ్డును దుండగులు మాయం చేశారు. సీఆర్డీయే కార్యాలయం భవనానికి ఎదుట ఉన్న రోడ్డును రాత్రి తవ్వేశారు. రోడ్డును తవ్వి ఇప్పుడు మెటల్ ను లారీలతో తరలించుకు పోయారు.
ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు చెబుతున్నారు. రోడ్డుపై పరచిన మెటల్‌ను దుండగులు రాత్రికి రాత్రే తరలించుకు పోయారు. రాజధానిలో పెరుగుతున్న రోడ్డు దొంగతనాలపై రాజధాని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
గతంలోనూ అమరావతిలోని దుండగులు రోడ్డును తవ్వేశారు. జేసీబీ సాయంతో రోడ్డును తవ్వేసి కంకర తరలించుకుపోయారు. రాత్రి పూట గుట్టు చప్పుడు కాకుండా రోడ్డును జేసీబీతో తవ్వేస్తున్న వీడియోలను అప్పట్లో టీడీపీ నేతులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
జగన్ సర్కారు దురుద్దేశంతో కావాలనే అమరావతి ప్రాంతంలో చంద్రబాబు హయాంలో నిర్మించిన రోడ్లను ధ్వంసం చేస్తోందని ఆరోపణలు గుప్పించారు. అంతకు ముందు మోదుగలింగాపూర్ సమీపంలో సీడ్ యాక్సన్ పక్కన రోడ్డును కూడా దుండగులు తవ్వేశారు.