గౌలిదొడ్డిలో అక్రమ నిర్మాణాల పై నార్సింగీ టౌన్ ప్లానింగ్ అధికారులు కన్నెర్రజేశారు. ఫుట్‌పాత్ పై అక్రమంగా వెలసిన నిర్మాణాలను జేసీబీలతో కూల్చి వేస్తున్న అధికారుల బృందం.
భారీ పోలీసు బందోబస్తు మధ్య నిర్మాణాలను నేలమట్టం చేసిన అధికారులు. ఈ క్రమంలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇలా నేరుగా వచ్చేసి కూల్చివేతలు ఎలా చేపడతారంటూ ఎదురుడాడికి దిగారు.
నిర్మాణాలతో పాటు విలువైన వస్తువులను కూడా ధ్వంసం చేశారంటూ నిర్మాణాదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకేసారి ఇలా కూల్చివేస్తే ఎలా అంటూ అగ్రహం వ్యక్తం చేశారు.
దీనికి సమాధానంగా ఫుట్‌పాత్‌ని ఆక్రమిస్తే సహించేది లేదంటు హెచ్చరికలు జారీ చేసిన అధికారులు.