డెంగ్యూ లేదని ఓపక్క వైద్య మంత్రి అంటారు. మరోపక్క కేటీఆర్ ఇల్లూ పరిసరాలూ మీరే నీట్‌గా వుంచుకోవాలండీ.. అని ట్వీట్లు పెడుతుంటారు. మరోపక్క కేసీఆర్ బడ్జెట్లో వైద్యఆరోగ్య శాఖకు కోత పెడుతుంటారు. ఇది ఇలానే జరిగిపోతుంటుంది. మరోపక్క తెలంగాణ జిల్లాలలో మరణ మృదంగా మోగుతూ వుంటుంది. డెంగ్యూ, విషజ్వరాల బారీన పడి జనం చస్తూనే వుంటారు.
హైదరాబాద్: వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాలలో ఆదివారం డెంగ్యూతో ముగ్గురు, విష జ్వరంతో ఇద్దరు మృతి చెందారు. భద్రాద్రిలోని రామవరం ప్రాంతంలో నక్షత్ర (9), చంద్రుగొండ మండలం పోకలగూడెంలో రవి (27)), వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం కస్తూర్‌పల్లిలో మణెమ్మ డెంగ్యుతో చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయారు. అలాగే, విషజ్వరాలతో ఇల్లెందు మండలం మాణిక్యారంలో రిషిత (8), మంచిర్యాల జిల్లా రామకృష్ణాపురంలోని సుభాష్ నగర్‌కు చెందిన సిరి చందన (8) చికిత్స పొందుతూ మృతి చెందారు.