కొంతకాలంగా కేటీఆర్ సీఎం అన్న మాటలు బలంగా వినపడుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలంతా కేటీఆర్ ను సీఎం చేయాలని కోరుతున్నారు. అయితే, దీన్ని కేటీఆర్ కానీ… పార్టీ ముఖ్యనేతలు కానీ ఖండించలేదు.
కానీ, మీరు కాబోయే సీఎం అంటూ కేటీఆర్ కు డిప్యూటీ స్పీకర్ పద్మారావు శుభాకాంక్షలు తెలిపారు. సికింద్రాబాద్ లోని రైల్వే ఎంప్లాయిస్ యూనియన్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులందరి తరుపున కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ కు శుభాకాంక్షలు అంటూ పద్మారావు వ్యాఖ్యానించగా, కేటీఆర్ మౌనం వహించారు.